Actor Vishal : నడిగర్ సంఘంలో మా పెళ్లి.. విశాల్ ప్రకటన

Update: 2025-08-30 12:00 GMT

నటుడు విశాల్, నటి ధన్సిక నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తమ పెళ్లి వాస్తవానికి నిన్ననే జరగాల్సి ఉందని చెప్పారు. 'నడిగర్ సంఘం' భవన నిర్మాణం కోసం తొమ్మిదేళ్లు ఆగినట్లు తెలిపారు. ఆభవన నిర్మాణం పూర్తి కాగానే అందులోనే తమ పెళ్లి జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు విశాల్. ఈ షరతుకు ధన్సిక కూడా ఓకే చెప్పిందన్నారు. మరో 2 నెలల్లో అది పూర్తిగా సిద్ధమవుతుందని, తమ పెళ్లి అందులోనే జరగనుందన్నారు. దీనికోసం ఇప్పటికే ఇందులో ఆడిటోరియం కూడా బుక్ చేసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ భవనం ప్రారంభోత్సవం జరిగిన వెంటనే తమ వివాహ తేదీ నిర్ణయిస్తామని తెలిపారు. అందులో జరిగే మొదటి పెళ్లి తమదేనని తెలిపారు.పుట్టినరోజు నాడే ఎంగేజ్మెంట్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని పోస్ట్ పెట్టాడు విశాల్. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగిన ట్లు వెల్లడించారు. అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేశాడు.

Tags:    

Similar News