Pawan Kalyan: కల్లబొల్లి కబుర్లు చెప్తే ఉద్యమం తప్పదు: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు భారీ సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.;
Pawan Kalyan (tv5news.in)
Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఏర్పాటు కోసం వైసీసీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు.. ఇందుకు వారం రోజులు టైమిస్తున్నానన్నారు పవన్ కల్యాణ్.. కల్లబొల్లి కబుర్లు చెప్తే మాత్రం కచ్చితంగా ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్.. చైతన్య వేదిక పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు కలిసిరావాలన్నారు.. సమస్యలొస్తే ఓడిన వారే రావాలా.. గెలిచిన వారు ఎందుకు రారని ప్రశ్నించారు.. ట్రేడ్ యూనియన్లు ఉండటం వల్లే ఇంకా సంస్థలు మిగిలివున్నాయని, లేకుంటే పాలకులు ఎప్పుడో అమ్మేసే వారని ఎద్దేవా చేశారు.