'ఆర్ఎక్స్’100 మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇందులో ఈ ఢిల్లీ భామ నటన, పాత్ర హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, తొలి సినిమా స్థాయిలో మరో విజయం రాలేదు. అలాగే మంగళవారం మూవీలో చేసిన క్యారెక్టర్ కు మంచి గుర్తింపు దక్కింది. కానీ అది కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో పాయల్ ప్రస్తుతం కొత్త కథల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని భావిస్తున్న ఈ వయ్యారి భామ, త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్స్ పై అధికారిక సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అమ్మడు తన గ్లామర్, ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతూ, అందరి హృదయాలను దోచుకుంటోంది. లేటెస్ట్ ఫొటోల్లో ఈబ్యూటీ స్కై బ్లూ కలర్ లెహంగా ధరించి చిరునవ్వుతో మెరిసిపోతూ, ఒలకబోసిన గ్రేస్ ఆమె అందాన్ని మరింత ఎలివేట్చేశాయి. చేతినిండా మెహందీ, గాజులతో సంప్రదాయ అమ్మాయిగా దర్శనమిస్తున్న ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారాయి.