Anasuya Bharadwaj: ఆయనిచ్చారు.. అందంగా లేదా.. : అనసూయ
Anasuya Bharadwaj: నెటిజన్స్‌తో పంచుకుంటూ ఓ గిప్ట్ ఇచ్చాడోచ్ అని చెబుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.;
Anasuya Bharadwaj: అనసూయ ఏం చేసినా అందంగానే ఉంటుంది.. దాక్షాయిణిగా కారా కిళ్లీ నములుతూ భర్తని కాలర్ పట్టుకుని నా తమ్ముడిని సంపినోడిని ఏం చేయవా.. ఆడిని అట్లనే వదిలిపెడతావా అని అడిగి ప్రేక్షకులచేత వావ్ అనిపించుకుంది. యాంకర్‌గా బుల్లి తెరమీద సందడి చేస్తున్న అనసూయకు వెండి తెర ఆఫర్లు వచ్చినా ఆచి తూచి అడుగేస్తుంది.. పాత్ర నచ్చితేనే సైన్ చేస్తుంది.. పుష్ప దిరైజ్‌లో తన నిడివి తక్కువగా ఉన్నా పుష్ప ది రూల్‌లో తగిన ప్రాధాన్యం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఇక ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయకు ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ ఓ బహుమతి ఇచ్చాడు.. దాన్ని నెటిజన్స్‌తో పంచుకుంటూ ఓ గిప్ట్ ఇచ్చాడోచ్ అని చెబుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. తన చేతి గడియారం కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది. అవును.. మేడమ్ మీతో సెల్ఫీ దిగుదామని అడిగితే ఫోన్ పగలగొట్టారట నిజమేనా అని అంటే.. ఎవరు సార్ మీకు చెప్పింది అని సదరు నెటిజన్‌ని ప్రశ్నించింది.
దానికి సంబంధించిన వీడియో ఉంది మీకు పంపుతాను మేడమ్.. మీ కారు నెంబర్ కూడా ఉంది అని సదరు నెటిజన్ అంటూనే.. ఒకవేళ ఇది ఫేక్ వీడియో అయితే జాగ్రత్తగా ఉండండి అని అనసూయ మీద అభిమానం కనబరిచాడు.. దీనికి అను స్పందిస్తూ... దయచేసి యూట్యూబ్‌లో వచ్చేవాటిని నమ్మకండి.. బతకడం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ఇలాంటివి చూసినప్పుడే మానవత్వం చచ్చిపోయిందని అనిపిస్తుంది.. దయచేసి ఒకరిపట్ల ఒకరం బాధ్యతగా ఉందాం.. నాగురించి ఇంతగా ఆలోచించినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. ఎప్పుడో జరిగిన సంగతులు ఇప్పుడెందుకు బాబూ అని మరికొందరు నెటిజన్లు సదరు వ్యక్తిని ఆటపట్టిస్తున్నారు.