Kamal Haasan : ప్లీజ్ నన్ను అలా పిలవకండి.. కమల్ హాసన్ రిక్వెస్ట్

Update: 2024-11-11 16:00 GMT

విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన కమల్ హాసన్ ఆ తరువాత వచ్చిన ఇండియన్ 2తో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా హీరో కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనను ఉలగనయగన్ అని పిలవద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. “నా పని నచ్చి నాకు ‘ఉలగనాయగన్’ అనే బిరుదు ఇచ్చారు. అందుకు అభిమానులకు థ్యాంక్యూ. సినిమాల విషయంలో నేను నిత్య విద్యార్థిని. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి, మరింత ఎదగాలని అనుకుంటున్నాను. నా విషయంలో కళా అనేది చాలా గొప్పది. ఎంతో ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. నా స్టార్ ట్యాగ్ ను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశాడు కమల్.

Tags:    

Similar News