పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్ ' పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. దాయాది దేశంతో పాటు 9 కీలక స్థావరాలను నేలమట్టం చేసింది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో నెటిజ న్లు, సినీ సెలబ్రిటీలు ఇండియన్ ఆర్మీకి అండగా నిలుస్తున్నారు. వారికి విరాళం ఇస్తూనే తమ అభిప్రాయాలను తెలుపుతూ ప్ర శంసలు కురిపిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొందరు యుద్ధంపై ఫన్నీ రీల్స్ చేస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు. దీనిపై తాజాగా నటి రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫైర్అయ్యింది. 'ఇప్పుడు యుద్ధ పరిస్థితులు తీవ్రతరంగా ఉన్నాయి. కొంతమంది వ్యూస్ కోసం ఫన్నీ రీల్స్, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మనం ప్రశాంతంగా నిద్రపో తున్నామంటే కారణం మన జవాన్లే. వారి ఫ్యామిలీలు, సరి హద్దుల సమీపంలో నివసించే సైనికులు.. దేశంలోని అమాయక పౌరుల బాధనిదయచేసి అర్థం చేసుకోండి . మన ప్రార్థనలు ఎప్పుడు వారికి అండగా ఉంటాయి. సున్నిత మైన సమయంలో ఐక్యంగా ఉండాలి. ఎక్కువ వ్యూస్, లైక్స్ కోసం అలాంటి వీడియోలు చేయొద్దు' అంటూ చేతులెత్తి దండం పెట్టే ఎమోజీని షేర్ చేసింది.