లైంగిక వేధింపుల కేసులో జైల్లో ఉన్న జానీ మాస్టర్ ను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి కోరుతూ సోమవారం నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
తాజాగా జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన సమయంలోనే నార్సింగ్ పోలీసులు విచారించి రిమాండ్ రిపోర్ట్ లో పలు విషయాలను పొందుపరిచారు. విచారణలో భాగంగా జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని, మరిన్నీ విషయాలు తెలుసుకునేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని నార్సింగ్ పోలీసులు భావించారు. వారం రోజుల పాటు తమ కస్టడీలో జానీ మాస్టర్ ను ఉంచాలని రంగారెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.