బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస ఆఫర్లతో బిజీగా ఉండేది. కానీ ఈ బ్యూటీ బ్యాడ్ లక్.. తను చేసిన సినిమాలు వరుస డిజాస్టర్లు అవడంతో మేకర్స్ ఈమెను దూరం పెట్టేశారు. దీంతో అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. కాగా ప్రస్తుతం తన కేరీర్ ను మళ్లీ గాడిలో పెట్టేపనిలో పడింది ఈ కన్నడ బ్యూటీ. ప్రస్తుతం ఆమె రెండు తమిళ మూవీస్ లో నటిస్తుండగా.. తాజాగా మరో ఆఫర్ కొట్టేసిందని టాక్. రాఘవ లారెన్స్ హీరోగా త్వరలో కాంచన 4 మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. హారర్, కామెడీ సీక్వెన్స్ లో రూపొందనున్న ఈ మూవీకి డైరెక్టర్, ప్రొడ్యుసర్, హీరో అన్నీ రాఘవ లారెన్స్ నే. ఇక ఈ సినిమాలో లారెన్స్ పక్కన హీరోయిన్ గా పూజ హెగ్దే చాన్స్ కొట్టేసిందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.