కెరీర్ ఆరంభంలో అన్నీ గ్లామర్ రోల్స్ నే చేసింది పూజా హెగ్డే. అవసరమైతే బికినీలూ వేసింది. నిజానికి బికినీ తర్వాతే అమ్మడికి టాలీవుడ్ లో కలిసొచ్చిందనే అందరికీ తెలిసిన విషయం. అప్పటి నుంచి ఒక్కో మూవీతో ఓ దశలో టాప్ హీరోయిన్ అనిపించుకుంది. కొన్నాళ్లకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చేతిలో తెలుగు సినిమాలే లేవు. కాకపోతే కోలీవుడ్ లో అడుగులు వేస్తోంది. అక్కడ సూర్య సరసన కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ‘రెట్రో’ అనే మూవీ చేస్తోంది. ఆ మధ్య విడుదలైన ఈమూవీ టీజర్ చూస్తే ఈ సారి గ్లామర్ కు దూరంగా కాస్త నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించబోతోందని అర్థం అవుతుంది. అయితే మరో మూవీలో అంతకు మించిన పాత్రలో కనిపించబోతోంది పూజాహెగ్డే. ఇంకా చెబితే ఇది నటన పరంగా ఛాలెంజింగ్ రోల్. ఆ రోల్ కు సిద్ధం అయ్యింది కాంచన 4 కోసం. లాఘవ లారెన్స్ హారర్ ఫ్రాంఛైజీలో వస్తోన్న మూవీ ఇది.
కాంచన 4లో పూజా హెగ్డే మూగ, చెవిటి అయిన ఓ గ్రామీణ యువతిగా నటిస్తోందట. ఇలాంటి పాత్ర అంటే ఛాలెంజింగ్ గానే ఉంటుంది కదా. కళ్లతోనే నటించాలి. చేతులతో సైగలు చేసిన కళ్లే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో.. ఈ పాత్రలో పూజాహెగ్డే అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే కానీ.. తనకూ ఇది ఓ అద్భుతమైన అవకాశం. ఇప్పటి వరకూ జిగేల్ రాణిగానే కనిపించి పూజాకు ఈ పాత్రతో తనలోని నటిని చూపించుకునే అవకాశం వచ్చిందనే చెప్పాలి.
ఇక ఈ మూవీలో పూజా కాకుండా బాలీవుడ్ బ్యూటీ నోరాఫతేహీ కూడా నటిస్తోంది. తను ఆల్ట్రా మోడ్రన్ గాళ్ గా ఎన్నారై పాత్రలో కనిపిస్తుందట. ఈ సమ్మర్ లో ఏప్రిల్ 19న విడుదల కాబోతోన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒక్క క్లైమాక్స్ మినహా మాగ్జిమం పూర్తయిందని టాక్. ముని అనే మూవీతో మొదలుపెట్టిన ఈ హారర్ సీరీస్ లన్నీ సూపర్ హిట్స్ గానే నిలిచాయి. అందుకే ఈ కాంచన 4 పైనా భారీ అంచనాలుంటాయి. వాటిని రీచ్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందా లేదా అనేది చూడాలి.