Poojitha Ponnada : పూజిత పొన్నాడ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్

Update: 2025-07-14 07:45 GMT

పూజిత పొన్నాడ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొనసాగిన ఈ వయ్యారి.. ఆ తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది . 'ఊపిరి'తో సిల్వర్ స్క్రీన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, కల్కి, రావణాసుర తదితర చిత్రాల్లో నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజిత హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు ట్రెడిషనల్ గా .. ఇటు గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మళ్లీ కలర్ జార్జెట్ మినీ ఫ్రాక్ ధరించిన పొన్నాడ.. మత్తెక్కించే చూపులతో కవ్విస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. గోల్డెన్ అవర్ సమయంలో మృదువైన సూర్యకాంతిలో ఆమె అందం మరింత మెరుపును జోడించింది. లేటెస్టుగా పూజిత షేర్చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News