హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ ఒక అమ్మాయిని గర్భవతిని చేసి ఆమె కెరీర్ నాశనం చేశాడని పూనమ్ కౌర్ ట్వీట్ లో చెప్పారు. MAA జోక్యంతో ఆ పంజాబీ నటికి కాస్త సహాయం దొరికిందన్నారు. అతడు లీడర్ గా మారిన నటుడు కాదని పూనమ్ హింట్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో రాజకీయ నేతగా ఉన్న నటుడిని అనవసరంగా లాగారని పూనమ్ కౌర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఓ డైరెక్టర్ పై త్రివిక్రమ్ పూనమ్ కౌర్ వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆ డైరెక్టర్ టార్గెట్ గానే పూనమ్ ట్వీట్ చేశారని భావిస్తున్నారు.