HBD Varun Tej: గని ఫస్ట్ గ్లింప్స్.. వరుణ్ లుక్ అదిరిందిగా..!
HBD Varun Tej: మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ అతి తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.;
HBD Varun Tej: మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ అతి తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. బుధవారం (జనవరి 19న) వరుణ్ బర్త్‌డే... ఈ సందర్భంగా వరుణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గని' నుంచి 'పవర్ ఆఫ్ గని' పేరిట స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు.
రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ లో సీరియస్ లుక్‌లో వరుణ్ కనిపిస్తున్నాడు. అభిమానులను ఈ స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. కాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం సంగీతం అందిస్తున్నాడు. తమన్నా ఐటెం సాంగ్ చేస్తోంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.