రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి గాయమైంది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు. జపాన్ లో వచ్చే నెల 3న రిలీజయ్యే ‘కల్కి2898 ఏడీ’ ప్రమోషన్లకు తాను హాజరవట్లేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కోసం ఆయన ఓ పోస్టును విడుదల చేశారు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలకు థ్యాంక్స్. జపాన్లోని అభిమానులను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్న. కానీ, మీరు నన్ను క్షమించాలి. మూవీ షూటింగ్ లో నా కాలు బెణికింది. అందుకే రాలేకపోతున్న. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది' అని పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, కల్కి2, సలార్ 2, స్పిరిట్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అలాగే ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.