రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. కానీ షూటింగ్స్ మాత్రం బాగా లేట్ అవుతున్నాయి. కారణం ఎవరు అనేది పక్కన పెడితే గత ఏప్రిల్ 10న విడుదల చేస్తాం అని చెప్పిన రాజా సాబ్ ను చాలా అంటే చాలా దూరం పోస్ట్ పోన్ చేశారు. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. హారర్ కామెడీ జానర్ లోనే నెక్ట్స్ లెవల్ అనేలా ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై రానంత హారర్ కంటెంట్ తో ఈ చిత్రం రూపొందుతుందని ఆ మధ్య టీజర్ తో చెప్పారు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. మరోవైపు విఎఫ్ఎక్స్ కు సంబంధించిన వర్క్స్ కూడా ఉన్నాయి. అయితే మేజర్ పార్ట్ షూటింగ్ అయింది కాబట్టి ఈ సమ్మర్ కు సినిమా విడుదల కాలేదు కనుక.. కనీసం టీజర్ అయినా ఇవ్వాలనుకున్నారు మేకర్స్.
రాజా సాబ్ టీజర్ ను మే నెలలోనే విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. బట్ అదేం వచ్చేలా లేదు అనేది లేటెస్ట్ న్యూస్. ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలో వెకేషన్ లో ఉన్నాడు. అక్కడి నుంచి మే నెలలో ఇక్కడికి వచ్చి ఈ టీజర్ కు డబ్బింగ్ చెబుతాడు అనే ప్రచారం జరిగింది. బట్ అదేం లేదు. ఆయన ఈ సమ్మర్ మొత్తం ఇటలీలోనే ఉండబోతున్నాడు. ఇక్కడ వేడి తగ్గిన తర్వాతే రావాలనుకుంటున్నాడట. ఒకవేళ మేకర్స్ ఒత్తిడి చేస్తే కేవలం డబ్బింగ్ చెప్పడానికి మాత్రం రావొచ్చు అంటున్నారు. అంతే తప్ప మే నెలలో తిరిగి ఇండియాకు వచ్చే ప్లాన్ లేమీ ప్రభాస్ కు లేవుట. సో.. ఈ నెలలో రాజా సాబ్ టీజర్ ప్రభాస్ ఇండియాకు రావడంపై ఆధారపడి ఉంటుంది.