Prabhas : దసరా మూవీస్ ను షేక్ చేస్తోన్న ప్రభాస్

Update: 2025-02-20 10:45 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ అంటే ఆ చుట్టుపక్కల రిలీజ్ లు అన్నీ మారిపోతుంటాయి కదా. బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ తో ఉన్నాడు డార్లింగ్ ఇప్పుడు. సలార్, కల్కి అంటూ బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ కొట్టి ఉన్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. దీంతో పాటు హను రాఘవపూడితో ఫౌజీ అనే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. వీటిలో రాజా సాబ్ ను ఈ సమ్మర్ లో ఏప్రిల్ 10న విడుదల చేస్తాం అన్నారు. కానీ షూటింగ్ లేట్ అయింది. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కు ఎక్కువ టైమ్ పడుతుందట. అందుకే పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ ను వాళ్లు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. వినిపిస్తోన్న డేట్ మాత్రం దసరా మూవీస్ ను డైలమాలో పడేస్తున్నాయి.

ఈ యేడాది అక్టోబర్ 2న దసరా పండగ వచ్చింది. ఆ టైమ్ కు రిషబ్ శెట్టి కాంతార 1 విడుదల కాబోతోంది. ఆ ముందు వారం సెప్టెంబర్ చివరి వారంలో సాయిదుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు, బాలకృష్ణ అఖండ 2 తాండవం విడుదల డేట్స్ అనుకున్నాయి. ఈ రెండు మూవీస్ కూడా భారీ బడ్జెట్ తో రూపొందినవే.

తాజాగా ప్రభాస్ రాజా సాబ్ ను కూడా సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది. అంటే సంబరాల ఏటిగట్టు, అఖండ 2 కు పెద్ద సమస్యే వస్తుంది. అలాగే కాంతారపైనా ప్రభావం కనిపిస్తుంది. ఒకవేళ ఆ సినిమాలు ధైర్యం చేసి బరిలో నిలిస్తే.. రాజా సాబ్ కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఖచ్చితంగా కమర్షియల్ గా అన్నీ లాస్ అవుతాయి. మరి ప్రభాస్ దసరా టార్గెట్ గా ఆ బరిలో నిలుస్తాడా లేదా అనేది చూడాలి. 

Tags:    

Similar News