Prakash Raj : కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) తన లేటెస్ట్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘రాయన్’ (Raayan) తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 26 న విడుదల కానుంది. తెలుగు హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) కీలక పాత్రలో నటించాడు.
రాయన్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ధనుష్ ఈ మూవీలోని ఇతర తారాగణం, సిబ్బందితో కలిసి హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో తాను, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించే కొత్త ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించాలని ప్లాన్ చేస్తున్నాడని వెల్లడించారు.
ఇది కార్యరూపం దాల్చితే .. ఇది ధనుష్ నాల్గవ డైరెక్టోరియల్ వెంచర్ అవుతుంది. ‘రాయన్’ తర్వాత ‘నిలావుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ అనే మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ ముగ్గురూ చివరిగా తిరుచిత్రంబలం (తెలుగులో తిరుగా విడుదలైంది) లో కలిసి వర్క్ చేశారు . ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
రాయన్‌లో ఇంకా.. ఎస్‌జె సూర్య, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ లాంటి వారు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.