ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 1, 2 మూవీస్ తో అతను దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. అదే అతన్ని క్రేజీ డైరెక్టర్ ను చేసింది. ఈ కారణంగానే ప్రభాస్ సైతం సలార్ సినిమాకు అవకాశం ఇచ్చాడు. అయితే సలార్ మూవీ సగానికి పైగా ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ కంటెంట్ తో ఉంటుంది. అతని ఫస్ట్ మూవీ ఏంటో తెలుసు కదా.. యస్.. ఉగ్రమ్. ఉగ్రమ్ హీరో శ్రీ మురళి. ఫస్ట్ మూవీతోనే కన్నడ నాట సంచలనం సృష్టించిన శ్రీ మురళి ఆ తర్వాత ఆ జోష్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. అయినా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మురళీ కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు డెబూడెంట్ గా ప్రశాంత్ నీల్ కు అవకాశం ఇచ్చాడు. ఈ కాంబోలో వచ్చిన ఉగ్రమ్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
అయితే ఉగ్రమ్ విజయాన్ని కూడా కొనసాగించలేకపోయాడు శ్రీ మురళి. ఆ మధ్య శివరాజ్ కుమార్ తో కలిసి మఫ్టీ అనే మూవీలో కూడా నటించాడు. బట్ ఈ క్రెడిట్ అంతా శివన్నకే వెళ్లింది. ప్రస్తుతం మళ్లీ అతను డౌన్ లో ఉన్నాడు. ఈ టైమ్ లో తన ఫ్రెండ్ కోసం ప్రశాంత్ నీల్ రాసిన కథతో హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో డాక్టర్ సూరి రూపొందించిన సినిమా ‘బఘీర’. లేటెస్ట్ కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. ఇప్పుడు నీల్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడా ఉంది కాబట్టి.. శ్రీ మురళిని కూడా అలాగే పరిచయం చేస్తున్నాడు. అందుకే ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. ఈ నెల 31నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏసియన్ తో కలిసి సురేష్ బాబు విడుదల చేస్తున్నాడు. అంటే అంచనాలు పెట్టుకోవచ్చు.
ఈ మూవీ టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాస్త కేజీఎఫ్ ఛాయలు ఉన్నా.. ఇందులో హీరో పోలీస్ ఆఫీసర్. చూస్తోంటే శ్రీ మురళికి మళ్లీ బ్రేక్ ఇచ్చే సినిమలా కనిపిస్తోంది. తెలుగులో ఎలాంటి రిజల్ట్ వచ్చినా.. కన్నడలో హిట్ అయితే అతని కెరీర్ మళ్లీ నిలబడుతుంది. మొత్తంగా తనకు దర్శకుడుగా మొదటి అవకాశం ఇచ్చిన మిత్రుడి కోసం తను రాసిన కథతో డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా ప్యాన్ ఇండియా స్థాయికి వెళుతుందేమో చూడాలి.