Prashanth Neel: ఒకే రోజు.. ఒకే దర్శకుడి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల..
Prashanth Neel: ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించే వాటి హవా ఎక్కువయిపోయింది.;
Prashanth Neel (tv5news.in)
Prashanth Neel: ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కించే వాటి హవా ఎక్కువయిపోయింది. ఇంతకు ముందు లాగా ఒక భాషలో తెరకెక్కించి మరో భాషలో రీమేక్ చేయకుండా ఈమధ్య సినిమాలన్నీ ప్రతీ భాషలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇలా అయితే నటీనటులకు, దర్శకులకు పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ వచ్చే అవకాశముంది. కానీ ఒకేసారి పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ పోరులో దిగితే ఎలా ఉంటుంది. ఈ బాక్సాఫీస్ ఫైట్‌ను మనం త్వరలోనే చూడబోతున్నాం.
పాన్ ఇండియా సినిమాలకు పెట్టిన బడ్జెట్ వెనక్కి రావడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఒక సినిమా విడుదల అయిన తర్వాత కనీసం రెండు వారాలు అయినా మరో పాన్ ఇండియా సినిమా విడుదలకు గ్యాప్ ఉండాలి. కానీ 2022 సంక్రాంతికి అలా జరగట్లేదు. రాధే శ్యామ్, భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్.. ఈ మూడు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమయ్యాయి. ఇందులో ఏ ఒక్క సినిమా కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు.
ఇప్పటికే సంక్రాంతికి పాన్ ఇండియా సినిమాల పోరు గురించి మూవీ లవర్స్‌లో పెద్ద చర్చే నడుస్తోంది. తాజాగా మరో రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ ఇందులో విశేషమేంటంటే ఈ రెండు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఒక్కడే.
ప్రభాస్‌తో కలిసి 'సలార్'ను, యశ్‌తో కలిసి 'కేజీఎఫ్2'ను ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు ప్రశాంత్ నీల్. కానీ ఒకేసారి ఈ రెండు సినిమాల విడుదల ఉంటుందేమో అన్న ప్రశ్న ప్రేక్షకులలో మొదలయ్యింది. సలార్ షూటింగ్ ప్రారంభించినప్పుడే ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల అయ్యే అవకాశం ఉందని మూవీ టీమ్ ప్రకటించింది. ఇక కేజీఆఫ్ అయితే ఏప్రిల్ 14న వస్తున్నట్టు దాదాపు ఖరారైంది.
రెండు పాన్ ఇండియా సినిమాలే.. అది కూడా ఒక దర్శకుడు తెరకెక్కించినవే. అందుకే ఈ రెండు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతున్నాయంటే ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎలాగో ఒక సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అన్న నిర్ణయం నిర్మాతల చేతిలో ఉంటుంది కాబట్టి వారు అధికారికంగా ప్రకటించే వరకు ఈ కన్ఫ్యూజన్‌కు ఫుల్ స్టాప్ పడదు.