Sobhita Dhulipala : ప్రెగ్నెన్సీ నిజం కాదు.. శోభితా క్లారిటీ!

Update: 2025-05-08 13:15 GMT

అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీళ్లు గుడ్ న్యూస్ చెప్పారంటూ సోషల్ మీడియాలో జరుగుతు న్న ప్రచారం అంతా ఉత్తదేనట. కొత్తగా పెళ్లైయిన జంటలపై ఏడాదిలోపే ఇలాంటి పుకార్లు పు ట్టుకొస్తున్నాయి. ఇటీవల అటు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే వార్తలు వచ్చాయి. శోభిత కూడా తల్లి కాబోతోందనేది విషయం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టింది. వీరిలో లావణ్య త్రిపాఠి నిజంగానే గర్భం దాల్చారు. ఈ విషయాన్ని ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య జంట అధికారికంగా ప్రకటించింది. అయితే శోభిత గురించి వినిపించిన 'గుడ్ న్యూస్ ' మాత్రం ఒట్టి వదంతి మాత్రమే. శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిపస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె టీమ్ ప్రక టించింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితం ఆస్వాదిస్తోందని, మాతృ త్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత శోభిత సి నిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్ ను పలక రిస్తోంది. ఇక నాగచైతన్య పెళ్లి తర్వాత 'తండేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథాలాజికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News