కన్నడ సినిమా ఒంధ్ కథే హెళ్ల ద్వారా 2019లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ప్రియాంక అరుళ్ మోహన్ . అదే సంవత్సరం తెలుగులో నాని సరసన గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ నటించిందీ అమ్మడు. తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం సినిమాలో చైత్ర పాత్రలో ఒదిగిపోయిందీ అమ్మడు. తర్వాత సరిపోదా శనివారం సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు రేంజ్ పెరిగిపోయింది. డాక్టర్ సినిమాతో పాటు డాన్ సినిమాలో కూడా నటించింది. ఇక సూర్య హీరోగా, పాండిరాజ్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో కూడా ప్రియాంక నటిస్తున్నట్లు సమాచారం. ఈ అమ్మడు ప్రస్తుతం ఇస్తాంబుల్ లో సేద తీరుతోంది. వేసవి కావడంతో అక్కడ విడిదికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు షేర్ చేసింది. ఇస్తాంబుల్ చరిత్ర, విభిన్న సంస్కృతి, ప్రకృతి దృశ్యాలు తన హృదయాన్ని పూర్తిగా ఎలా ఆకట్టుకున్నా యో ఈ పోస్టులో తెలిపింది. ఆమె ఫొటోలను చూసిన అభిమానులు లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు.