ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని చెప్పారు నిర్మాత అశ్వనీదత్. ‘‘రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నం 1’కు నేను ప్రజంటర్‌గా వ్యవహరించా. తొలి చిత్రమే అయినప్పటికీ ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ ఉంది’’ అని అశ్వనీదత్ తెలిపారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.1150 కోట్లు వసూలు చేసిందని అశ్వనీదత్ వెల్లడించారు. బడ్జెట్ విషయంలో తాను ఎలాంటి నిబంధనలు పెట్టలేదని చెప్పారు.