Producer Kedar Selagamshetti : ప్రముఖ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూత

Update: 2025-02-26 10:00 GMT

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి కన్నుమూశారు. ఆయన దుబాయ్‌లో చనిపోయినట్లు సినీవర్గాలు తెలిపాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘గం..గం.. గణేశా’ సినిమాకు కేదార్ నిర్మాతగా పనిచేశారు. బన్నీ వాసు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు ఈయన సన్నిహితుడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్, విజయ్ కాంబోలో రాబోతున్న సినిమాను కేదార్ నిర్మించనున్నారు. ఇప్పటికే సుకుమార్ కు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనుహ్య పరిస్థితుల్లో ఆయన మరణానికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలోని చాలా మంది దుబాయ్ లోనే ఉన్నారు.

Tags:    

Similar News