Puneeth Raj Kumar: చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో.. ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా..

Puneeth Raj Kumar: పునీత్ 1997లో దూరదర్శన్‌లో 'నాన్న నిన్న నడువే' అనే సీరియల్‌లో నటుడిగా

Update: 2021-10-29 09:27 GMT

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ లెజెండరీ కన్నడ సినిమా స్టార్ డాక్టర్ రాజ్ కుమార్, శ్రీమతి పార్వతమ్మల చిన్న కుమారుడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 12 సినిమాల్లో నటించాడు. "బెట్టాడ హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. 'అప్పు' సినిమాతో మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టాడు.

పునీత్.. అశ్విని రేవనాథ్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయి ధృతి, చిన్న అమ్మాయి వందిత. బెట్టాడ హూవు, భాగ్యవంత, వసంతగీత, చలీసువ మొదగలు, ఏరడు నక్షత్రాలు చిత్రాల్లో బాలనటుడిగా నటించిన పునీత్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. బెట్టాడ హూవు చిత్రానికి బాలనటుడిగా "జాతీయ అవార్డు" కూడా గెలుచుకున్నాడు.

పునీత్ ఒక్కో సినిమాకు దాదాపు 2.07 కోట్ల INR వసూలు చేస్తారని శాండవుల్ టాక్. కన్నడ నటులందరిలోకి అతడిదే అత్యధిక పారితోషికం. 100 రోజులకు పైగా విజయవంతంగా ఆడిన సినిమాలు 10 పైన ఉన్నాయి. దీన్ని బట్టి ఆయనకు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో హిట్ సినిమాలను అందించిన ఏకైక నటుడు పునీత్ మాత్రమే.

పునీత్ 1997లో దూరదర్శన్‌లో 'నాన్న నిన్న నడువే' అనే సీరియల్‌లో నటుడిగా (షారుక్ ఖాన్ అభిమానిగా చాలా ఫన్నీ క్యారెక్టర్) ఒక చిన్న పాత్ర చేశాడు. పునీత్ సినిమా 'మిలనా' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బెంగళూరులోని చాలా మల్టీప్లెక్స్‌లలో ఒక సంవత్సరం పాటు విజయవంతంగా ఆ సినిమా ఆడింది. ఇది కాకుండా, పునీత్ "వంశీ" చిత్రంలో కూడా నటించాడు, అది బ్లాక్ బస్టర్.. బాక్సాఫీస్ హిట్.

Tags:    

Similar News