Puneeth Rajkumar: ఫునీత్ రాజ్‌కుమార్‌కి ఎందుకంత క్రేజ్.. అభిమానులు పిలుచుకునే పేరు..
Puneeth Rajkumar: ఉదయం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం కన్నుమూశారు.;
Puneeth Rajkumar: కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరైన 46 ఏళ్ల పునీత్ ప్రముఖ కన్నడ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు. పునీత్ తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు, భారతీయ సినిమా యొక్క గొప్ప నటులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.
దక్షిణాదిలో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. తన నటనతో నమ్మకమైన అభిమానులను సృష్టించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని 1.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాల ఎంపిక పునీత్‌ని మిగతా నటుల కంటే భిన్నంగా చూడడం మొదలు పెట్టారు అభిమానులు. పునీత్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'అప్పూ' ప్రభంజనం సృష్టించడంతో అభిమానులు అతడిని అప్పటి నుంచి 'అప్పూ' అని పిలుచుకోవడం మొదలు పెట్టారు.
2002 లో విడుదలైన 'అప్పూ' రొమాంటిక్ కామెడీ చిత్రం. నటి రక్షితతో కలిసి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. 'అప్పూ' మంచి ఆదరణ పొంది థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది.
పవర్ స్టార్ అనే పేరు సంపాదించి పెట్టిన కొన్ని చిత్రాలలో అప్పు (2002), అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలానా (2007), వంశీ (2008). 2000, 2010లలో అతని విజయవంతమైన చిత్రాల పరంపర పునీత్ రాజ్‌కుమార్‌ను దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా స్థిరపడింది.
అతని తదుపరి చిత్రం జేమ్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంత గొప్ప నటుడు ఇంత హఠాత్తుగా కన్నుమూయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉదయం గుండెపోటుతో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన పునీత్ రాజ్‌కుమార్ విక్రమ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ కన్నుమూశారు.