Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మరణంతో ఆగిపోయిన సినిమాలు..
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం వల్ల అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.;
Puneeth Rajkumar (tv5news.in)
Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం వల్ల అందరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన అభిమానులే కాదు శాండల్‌వుడ్ ప్రేక్షకులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఎంతోమంది దర్శకులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఫ్లాప్‌లతో సతమతమవుతున్న డైరెక్టర్స్‌కు లైఫ్ ఇచ్చారు. అలాంటి పునీత్ తన అప్‌కమింగ్ రెండు సినిమాలను అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోవడం చాలా బాధగా అనిపిస్తోంది అంటున్నారు ప్రేక్షకులు.
మామూలుగా నటీనటుల సినీ కెరీర్‌లో కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలు ఉంటాయి. వాటిపైన ప్రేక్షకులు ప్రత్యేకంగా దృష్టిపెడతారు. అలా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో హీరోగా 30వ చిత్రం ఖరైరయ్యింది. దాని షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. చేతన్ కుమార్ దర్శకత్వంలో ప్రియా ఆనంద్, పునీత్ రాజ్‌కుమార్ జంటగా నటిస్తున్న చిత్రమే 'జేమ్స్'. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే స్టేజ్‌కు చేరుకుంది. కానీ ఇంతలోనే సినిమాకు మళ్లీ కోలుకోలేని నష్టం జరిగింది.
ఇక జేమ్స్ తర్వాత ఒక పాన్ ఇండియా చిత్రానికి సైన్ చేశారు పునీత్ రాజ్‌కుమార్. 'ద్విత్వ' అనే టైటిల్‌తో ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. యంగ్ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. కానీ షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ద్విత్వ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పునీత్ రాజ్‌కుమార్ 30వ చిత్రం కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూశారు. అలాంటిది ఆయన ఇక తెరపైనే కనిపించరన్న విషయం నమ్మడం కష్టమే..