Allu Arjun, Ram Charan : పుష్ప 2, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయ్..

Update: 2024-07-22 07:50 GMT

రోజు రోజుకూ డిసెంబర్ హీటెక్కుతోంది. వరుసగా స్టార్ హీరోలంతా డిసెంబర్ ను టార్గెట్ చేసుకుని రిలీజ్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప డిసెంబర్ ను ఫిక్స్ చేసుకుంది. అటు గేమ్ ఛేంజర్ కూడా అదే నెలలో వస్తుందంటున్నారు. బాలకృష్ణ 109వ సినిమా కూడా అదే నెల ప్లాన్ లో ఉంది. వీటికి ముందే టైర్ టూ హీరోలైన నితిన రాబిన్ హుడ్, నాగ చైతన్య తండేల్ క్రిస్మస్ బరిలో నిలిచాయి. లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కాంబోలో వస్తోన్న కుబేరను కూడా డిసెంబర్ లోనే విడుదల చేయాలనుకుంటున్నట్టు టాక్. మరి ఇన్ని సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ కావడం అంత సులువేం కాదు. అందుకే ఒకరికి పోటీగా ఉండకుండా కాస్త ఫ్లెక్సిబుల్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటూ.. ఓపెనింగ్స్ కు ఇబ్బంది రాకుండా చూసుకోవాలుకుంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2, గేమ్ ఛేంజర్ డేట్స్ ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ టాక్.

పుష్ప 2 ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ అన్నారు. దీంతో చాలామంది ఫస్ట్ పార్ట్ వచ్చిన డేట్ కు వస్తుందనుకున్నారు. బట్ లేటెస్ట్ అడ్జెస్ట్ మెంట్స్ ప్రకారం డిసెంబర్ 6న పుష్ప 2ను విడుదల చేయాలనుకుంటున్నారట. అలాగే డిసెంబర్ 20న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుందంటున్నారు. అంటే రెండు సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఈజీగా పుష్ప 2 టార్గెట్ ను రీచ్ కావొచ్చు. ఇక క్రిస్మస్ హాలిడేస్ గేమ్ ఛేంజర్ కు ఓవర్శీస్ లో ఎక్కువ ప్లస్ అవుతుంది. ఒకవేళ అదే టైమ్ కు రాబిన్ హుడ్, తండేల్ వస్తే కొంత వరకూ థియేటర్స్ తగ్గొచ్చు.

విశేషం ఏంటంటే.. కుబేర వచ్చనా రాకున్నా.. బాలయ్య మూవీ మాత్రం డిసెంబర్ లోనే అంటున్నారు. సో.. పుష్ప 2, గేమ్ ఛంజర్ మధ్య వారంలో ఆయనా వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా డిసెంబర్ ఫుల్ ప్యాక్అయిపోయిందనే చెప్పాలి. 

Tags:    

Similar News