Pushpa 2 Reloaded : ఇవాల్టి నుంచి థియేటర్లలో పుష్ప -2 రీ లోడెడ్

Update: 2025-01-17 15:00 GMT

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తె రకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ పుష్ప-2. ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. అదేమిటంటే ఇవాల్టి నుంచి థియేటర్లలో 'పుష్ప 2' రీలోడెడ్ వెర్షన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎడిటింగ్ లో తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్ ను ఈ రోజు నుంచి యాడ్ చేస్తూ.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లో న్యూ వర్షన్ ను ప్రదర్శిస్తున్నారు మరో వైపు ఈ సినిమా టికెట్ ధరలను కూడా తగ్గించారు మేకర్స్. నైజాంలో పుష్ప రీలోడెడ్ వర్షన్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్లో రూ.112గాను అండ్ మల్టీ ప్లెక్స్లో రూ. 150 గానూ నిర్ణయిస్తూ అఫీ షియల్గా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. దీంతో సినీ ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమా ఫుల్ రన్ లో దంగల్ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News