Pushpa: The Rule: పుష్ప పార్ట్ 2... ఏంటి కథ.. మరో పవర్‌ఫుల్ విలన్..!!
Pushpa: The Rule: పుష్పరాజ్ ప్రియురాలు శ్రీవల్లికూడా సెకండ్ పార్ట్‌లో రూల్ చేస్తుందేమో.;
Pushpa: The Rule: హీరో అంటే అడ్డొచ్చిన అందర్నీ అడ్డంగా నిరకేస్తాడు.. ఒంటి చేత్తో ఎంతటి వాడినైనా మట్టికరిపిస్తాడు.. పుష్పరాజ్ కూడా అందుకు ఏమాత్రం తీసిపోడు.. ఆ విషయం పార్ట్ 1 పుష్ప ది రైజ్‌లో తెలిసిపోయింది.. మరి పార్ట్ 2 పుష్ప ది రూల్‌లో సుకుమార్ ఏం చూపించనున్నారు.. వన్‌లో కామ్‌గా ఉన్న క్యారెక్టర్లన్నీ ఎలివేట్ చేస్తారా.. మంగళం శీను, దాక్షాయణి, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్.. ఈ క్యారెక్టర్లన్నీ పుష్ప మీద పగ, ప్రతికారం పెంచుకున్నాయి.. సెకండ్ పార్ట్‌లో వాళ్ల ప్రతాపం ఏంటో చూపిస్తారేమో.. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వదిలేసిన సుకుమార్ పుష్ప ది రూల్‌లో మరో సరికొత్త కథకు తెరతీస్తారని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులు థియేటర్‌కు రావాలని సుకుమార్ భావించి ఉండవచ్చు. తనదైన మార్కుతో పుష్ప ది రూల్‌లో ముగింపు ఇవ్వొచ్చు. తొలి భాగంలో పుష్పరాజ్ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్ సింగ్ ఎలా పగ తీర్చుకుంటాడనే దాన్ని పార్ట్ 2లో చూపించనున్నారు.. అయితే అది ఒంటరిగానా లేదా మంగళం శీను, దాక్షాయణిలతో కలిసా అన్నది ఆసక్తికరం.
జాలీ రెడ్డిగా కనిపించిన కన్నడ నటుడు ధనుంజయ్‌కి కూడా పార్ట్1లో ఎక్కువ స్కోప్ లేదు.. అతడి పాత్ర కూడా పుష్ప ది రూల్ కంటిన్యూ అవుతుండొచ్చు.
ఇక ఓ సస్పెన్స్ క్యారెక్టర్‌ని తెరపైకి తీసుకు వచ్చిన సుకుమార్.. మురుగన్ అని పేరు మాత్రం చెప్పి వదిలేశారు. సినిమాలో ఆ పేరు ప్రస్తావన చాలా సార్లు వస్తుంది.. పార్ట్ 2 కోసమే ఆ వ్యక్తి ఎవరనేది రివీల్ చేయలేదనుకుంటా. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పాత్రలకంటే ఆ పాత్ర బలమైందా అనేది తెలియాలి. పుష్పరాజ్ ప్రియురాలు శ్రీవల్లికూడా సెకండ్ పార్ట్‌లో రూల్ చేస్తుందేమో.
ఎంతటి విలన్ అయినా పుష్ప రాజ్ ముందు తలవంచాల్సిందే.. ఈ పుష్పరాజ్ తగ్గేదే.. లే అన్నాడు.. అతడి కంటే బలమైన విలన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు అని టాలీవుడ్ టాక్. పుష్పరాజ్ తండ్రి ఎవరు అనేది ఆడియన్స్‌కి తెలియాల్సి ఉంది.. అజయ్ క్యారెక్టర్ కూడా అసంపూర్తిగా ఉంది.. వీటన్నింటికీ దిరూల్‌లో ఓ క్లారిటీ వచ్చేస్తుంది. అన్నిటికీ మించి దేవీ శ్రీ బీట్స్ మరో ఐటెం సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.. ఈ సారి కూడా సమంతనే తీసుకుంటారా లేక అంతకు మించి ఎవరైనా ఉన్నారా అనేది పుష్పరాజ్ వేట ప్రారంభించాల్సిందే.