రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగు ఆడియన్స్ ప్రధానంగా ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. రిలీజ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ టాక్ రావడం ఖాయం అనుకుంటున్నారు. అయితే ఈ మూవీ ప్రీమియర్స్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో. తెలంగాణలో ప్రీమియర్స్ పడటం కష్టంగా మారింది. ప్రధానంగా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఉండకపోవడం లోపంగా మారింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ టికెట్ ధరల కోసం పెంచుకునేందుకు సరైన కారణంగా చెబుతూ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. మరి హై కోర్ట్ లో విషయం తేలిపోతేనే తెలంగాణలో అదే ధరలకు ప్రీమియర్స్ పడతాయి. లేదంటే పాపత రేట్లకే షో పడబోతోంది. సో.. ఏదేంటీ అనేది హై కోర్ట్ లో తేలాల్సి ఉంది.
ఇక ప్రభాస్ తో పాటు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించాడీ మూవీలో. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించాడు. మారుతి మాత్రం ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ అంచనాలన్నీ తేలాల్సింది మాత్రం సినిమా రిజల్ట్ మాత్రమే. మరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది తేలాల్సి ఉంది.