Raashii Khanna : భాష అర్ధం అయితే చాలు ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చు: రాశీఖన్నా

Update: 2024-06-05 06:57 GMT

మనం సినిమాతో టాలీవుడ్ లోకి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అనంతరం ఊహలు గుస గుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంది. బహుభాషా కథానాయికల్లో ఒకరైన ఈ బ్యూటీ.. కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లోనూ యాక్ట్ చేస్తోంది. తమిళ్ లో ఈ అమ్మడు చేసిన ఫస్ట్ మూవీ ఇమైకా నొడిగళ్. ఇందులో నయనతార లీడ్ రోల్ పోషించగా.. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

కాగా తాజాగా ఈమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం అరణ్మణై 4. తెలుగులో ఇది బాక్ అనే టైటిల్ తో రిలీజైంది. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా కూడా మరో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఇందులో తమ న్నాతో పోటీ పడి మరి అందాలను ఆరబోసింది రాశీఖన్నా. ఇప్పుడీ సినిమా హిందీలోనూ రిలీజైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాశీఖన్నా మాట్లాడుతూ.. తాను ప్రస్తు తం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నానని.. భాష అర్ధం అయితే చాలు ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని తనకు తెలుసని వెల్లడించింది. ఇప్పుడు తాను తమిళం, తెలుగు భాషలనుఅర్థం చేసుకుని మాట్లాడగల నని చెప్పుకొచ్చింది. కాబట్టి ఇకపై తనకు భాషా సమస్య లేదని చెప్పింది. అరణ్మణై 4లో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని రాశీఖన్నా పేర్కొంది.

Tags:    

Similar News