Radhe Shyam: 'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా యంగ్ హీరో..
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా ‘రాధే శ్యామ్’ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది.;
Radhe Shyam (tv5news.in)
Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా 'రాధే శ్యామ్' కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఓ పూర్తిస్థాయి లవర్ బాయ్‌గా నటించి చాలాకాలమే అయ్యింది. రాధే శ్యామ్‌లో పూర్తి లవర్ బాయ్ లుక్‌తో లేడీ ఫ్యాన్స్‌ను మరోసారి ఫిదా చేసేశాడు ప్రభాస్. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్.
'రాధే శ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ అందంగా ముస్తాబవుతోంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి కూడా ఒక పీరియాడిక్ ఫీల్ తెచ్చే సెట్‌ను వేయనున్నట్టు సమాచారం. అంతే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఈవెంట్‌కు హాజరు కావచ్చని కూడా టాక్. అంతే కాకుండా ఈవెంట్‌లో మరింత ఫన్‌ను నింపడానికి ఓ యంగ్ హీరోను హోస్ట్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం.
'జాతిరత్నాలు' సినిమాతో ఒక్కసారిగా యూత్ స్టార్‌గా మారిపోయాడు నవీన్ పోలిశెట్టి. ఆ సినిమా తక్కువ బడ్జెట్‌తో, అసలు అంచనాలు లేకుండా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్‌ను అందుకుంది. అయితే జాతిరత్నాలు ట్రైలర్‌ను అప్పట్లో ప్రభాస్‌తోనే లాంచ్ చేయించింది మూవీ టీమ్. అందుకే ప్రభాస్ కోసం తాను రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడట నవీన్ పోలిశెట్టి. ఈ ఇద్దరు ఒకే స్టేజ్‌పై చేసే ఫన్ ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.