కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడు, నటుడుగా టర్నింగ్ ఇచ్చుకుని.. అన్న ఏ స్టెప్ వేసినా సక్సెస్ అనిపించుకున్నాడు రాఘవ లారెన్స్. మల్టీ టాలెంటెడ్ గా కోలీవుడ్ తో పాటు అప్పుడప్పుడూ తెలుగులోనూ సత్తా చాటుతున్న లారెన్స్ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా అతని కొత్త సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి. త్వరలోనే హీరోగా 25వ సినిమా చేయబోతున్నాడు లారెన్స్. తెలుగు దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేయబోతోన్న మూవీ ఇది. అయితే ఈ మూవీ కాంచన సిరీస్ కు కొనసాగింపుగా ఉంటుందనే టాక్స్ వచ్చాయి. బట్ హారర్ కాకుండా ఓ యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథతో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారట ఈ ఇద్దరూ. కాంచన సిరీస్ డబ్బింగ్ పార్ట్స్ తో లారెన్స్ కు నార్త్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే 25వ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఈ చిత్రానికి కాల భైరవ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ సూపర్ హీరో తరహాలో లారెన్స్ ఈ మూవీలో కనిపిస్తాడని టాక్.
మరోవైపు తమిళ్ లో చేస్తోన్న అతని కొత్త సినిమా టైటిల్ గా తెలుగుకు కూడా సెట్ అయ్యేలా ‘బుల్లెట్టు’ అని పెట్టారు. మామూలుగా మాస్ హీరోల మూవీస్ లో బుల్లెట్టు దిగుతుంది అనే డైలాగ్స్ ఉంటాయి. చాలా క్యాచీగా ఉన్న ఈ పదం ఇంగ్లీష్ దే అయినా తెలుగులోనే సెట్ చేశారు. ఇనాసి పాండ్యన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో వైశాలి రాజ్ హీరోయిన్. సునిల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు.
బర్త్ డే సందర్భంగా కాంచన సిరీస్ నుంచి కూడా ఏదైనా అప్డేట్ ఉందనుకున్నారు. చూస్తుంటే అలాంటిదేం లేదేమో అనిపిస్తోంది కదా.