ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు గతేడాది తమ 29 ఏళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ చెప్పారు. విడాకుల ప్రకటన తర్వాత వచ్చిన ట్రోలింగ్స్ పై రెహమాన్ తాజాగా స్పందించారు. "సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. వారి జీవితాల్లో ఏం జరుగుతుందో పరిశీలిస్తుంటారు. ఇక విమర్శలు సర్వసాధారణం. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను కూడా అంతే. నా గురించి తప్పుగా మాట్లాడేవారిని కూడా నా కుటుంబ సభ్యులే అనుకుంటాను. నేను ఒకరి గురించి తప్పుగా మాట్లాడితే... నా గురించి మరొకరు మాట్లాడుతారు. నా ఫ్యామిలీని ఎవరైనా విమర్శిస్తే... నేను బాధపడతాను. అలాగే ఇతరులకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా... అందుకే నేను ఎప్పుడూ ఎవరి గురించి తప్పుగా మాట్లాడను. వారందరినీ సరైన మార్గం నడిపించమని దేవుడిని ప్రార్థిస్థాను" అని రెహమాన్ చెప్పుకొచ్చారు.
రెహమాన్, సైరా బాను 1995లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. గతేడాది వారి 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు.