Rajinikanth: రజనీకాంత్ కూడా ఈ బిజినెస్ లోకి దిగాడుగా!
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏం చేసినా స్పెషలే.;
Rajinikanth (tv5news.in)
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏం చేసినా స్పెషలే. ఆయన మామూలుగా అలా నడుచుకుంటూ వచ్చినా స్టైలే.. కాలుపై కాలు వేసుకుని కూర్చున్నా స్టైలే.. షర్ట్ మడతేసినా స్టైలే.. కాలరెగరేసినా స్టైలే.. అందుకే ఆయన స్టైల్‌కు, గ్రేస్‌కు తమిళనాడులోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఏం చేసినా అందరూ అభిమనిస్తారు. అందుకే రజినీ ఓ కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారు.
రజినీకాంత్ కూతురు సౌందర్య.. యూత్ కోసం ఒక కొత్త యాప్‌ను తయారుచేశారు. ఆ యాప్‌ను రజినీకాంత్ తన చేతుల మీదుగా లాంచ్ చేయడమే కాకుండా దానిని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖను కూడా పంచుకున్నారు. మామూలుగా ఇప్పుడు అందరం వాడుతున్న వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కూడా వాయిస్ మెసేజ్ ఆప్షన్ ఉంది. కానీ అది చాలా తక్కువమందే ఉపయోగిస్తారు. అందుకే వాయిస్ మెసేజెస్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా 'హూటే' అనే యాప్‌ను తయారు చేశారు సౌందర్య.
రజినీకాంత్ ఈ హూటే యాప్ గురించి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. సౌందర్య విశగన్‌కు రూపొందించిన సోషల్‌మీడియా యాప్' హూటే'(HOOTE)ను లాంచ్ చేస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం రోజున తన స్వరంతో హూట్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు సూపర్‌స్టార్ రజినీకాంత్ తెలిపారు. పైగా ఇదే రోజు ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం.
యాప్‌లో యూజర్లు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చును. హూట్ యాప్‌ను వాడే యూజర్లు తమకు నచ్చిన ఏ భాషలోనైనా వారి ఆలోచనలను, అభిప్రాయాలను వారి వాయిస్ రూపంలో వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఇదే పోలికలతో ఉన్న క్లబ్ హౌస్ యాస్ కొన్నాళ్లు టెక్ వరల్డ్‌లో ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ఇంచుమించు అదే ఫీచర్స్‌తో హూటే యాప్ లాంచ్ అవుతుంది.