రిలేషన్ వాల్యూ తెలియక గతంలో ఓ చిన్న కారణంతో తనను ప్రేమించిన వ్యక్తిని రిజెక్ట్ చేశానని హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలిపారు. ‘హోటల్లో నా కోసం అతను ఆర్డర్ చేసిన ఫుడ్ నచ్చలేదు. నేను కోరిన ఫుడ్‌ని తక్కువ చేసి చూశాడు. దీంతో బ్రేకప్ చెప్పా. నా భోజనాన్ని, జీవనశైలిని పంచుకోలేని వ్యక్తి నాకు అనవసరం అనిపించింది’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఫుడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని, ఆహారాన్ని గౌరవిస్తానని పేర్కొంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఆహారంలో మార్పులు చేసి తగ్గించుతానని వెల్లడించింది. హెల్తీగా ఉండాలని ఒక సంవత్సరం పొడవునా కేవలం శాకాహార భోజనమే తిన్నానని చెప్పింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడారు. రకుల్ తెలుగులో చివరి సినిమా కొండపొలం. 2021లో ఈ మూవీ విడుదలైంది. రీసెంట్‌గా భారతీయుడు2లో ఆమె కనిపించారు. ప్రస్తుతం అజయ్‌దేవగణ్‌తో 'దే దే ప్యార్ దే 2'లో నటిస్తున్నారు. మేరీ పట్నీ కా రీమేక్ చిత్రంతో పాటు భారతీయుడు-3 ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉన్నాయి.