Rakul Preet Singh : త్వరలోనే రకుల్ గుడ్ న్యూస్

Update: 2024-04-06 07:02 GMT

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఆ మధ్య బాగా ట్రెండింగ్ అయ్యాయి. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. త్వరలోనే గుడ్ న్యూస్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులకు హింట్ ఇచ్చేసింది.

వేరే ఏదో గుడ్ న్యూస్ కాదు. త్వరలోనే అమ్మడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఉగాదికి గుడ్ న్యూస్ చెప్తాను అంటూ రకుల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ లో ఉంది. టేస్టీగా హెల్తీగా రెండిటిలో ఏది చేయాలి అనేది ఉగాదికే డిసైడ్ చేస్తాను అంటూ పండ్లు తింటూ కనిపించింది రకుల్.

ఉగాది నుంచి వంటకాలకు సంబంధించిన కొన్ని వీడియోలు చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవల మెగా కోడలు ఉపాసన కూడా అత్తమ్మ కిచెన్ అంటూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Tags:    

Similar News