ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న చిత్రానికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ టైటిల్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, డిప్యూటీ సిఎమ్ తాలూకా అనే పేర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా పాపులర్ అయ్యాయి. ఆ కారణంగా ఈ టైటిల్ క్యాచీగా మారిపోయింది. అదే రామ్ మూవీకి ప్లస్ కాబోతోంది. అయితే టైటిల్ చూడగానే ఇదేమైనా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీనా అనే అనుమానం రావొచ్చు. కానీ కాదు.
ఈ చిత్రంలో హీరో ఆంధ్రా కింగ్ అనే బిరుదు ఉన్న ఓ ‘సినిమా హీరో’కు అభిమాని అట. తన అభిమాన హీరో బిరుదును తను పెట్టుకుని అలా ఆంధ్రా కింగ్ తాలూకా అనే పేరును పెట్టబోతున్నారు. మరి ఈ హీరో పాత్ర ఎవరు చేస్తున్నారో తెలుసా.. ఉపేంద్ర. కన్నడ హీరో ఉపేంద్ర ఆ ఆంధ్రా కింగ్ గా నటించబోతున్నాడు. సో.. సినిమాలో సినిమా హీరోగా ఉపేంద్ర నటిస్తోంటే.. అతని అభిమానిగా రామ్ కనిపించబోతున్నాడు. ఈ మూవీలో ఉపేంద్ర ఫస్ట్ టైమ్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడంటున్నారు. అతనికి లుక్ టెస్ట్ చేసిన తర్వాతే తీసుకున్నార్ట.