Rashmika Mandanna : చావా విజయంతో రష్మికలో జోరు

Update: 2025-02-18 12:45 GMT

దక్షిణాది హీరోయిన్ బాలీవుడ్ లో వరుస విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే హిందీ చిత్రాల్లో ఎక్కు అవకాశాలు ఉత్తరాది నాయికలకే దక్కుతుంటాయి. పైగా వారికి స్టార్ డమ్ కూడా ఎక్కువే. అయినప్పటికీ దక్షిణాదికి చెందిన రష్మిక మందన్నా బాలీవుడ్లో విజయవంతమైన నాయికగా పేరు తెచ్చుకుంటోంది. ఇటీవలే విడుదలైన 'ఛావా' సినిమా బాక్సాఫీస్ విజయం దక్కించుకుంది. ఇందులోని యువరాణి పాత్ర ఆమెను వెతుక్కుంటూ రావడమే విచిత్రం. వికీ కౌషల్ హీరోగా నటించారు. ఈ సినిమా కంటే ముందు తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' సినిమా కూడా జాతీయ స్థాయిలో పెద్ద హిట్ అయింది. ఇందులో రణ బీర్ కపూర్ హీరోగా నటించారు. నాయికగా నటించిన రష్మికకు మంచిపేరు వచ్చింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాగా 'పుష్ప 2' మెగాహిట్ అయింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా అంతర్జాతీయంగా భారీ కలెక్షన్స్ తెచ్చింది. ఈ మూడు విజయాలతో రష్మిక హ్యాట్రిక్ హిట్స్ సాధించిందని అంటున్నారు. రష్మిక ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్ తో 'సికిందర్', నాగార్జున, ధనుష్ నటిస్తున్న 'కుబేర' చిత్రంలో నటిస్తోంది. 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నిర్మాణంలో ఉంది.

Tags:    

Similar News