Rashmika : కథ బాగుంటే చాలు..బామ్మ పాత్ర చేసేందుకు రెడీ : రష్మిక మందన్న

Update: 2025-02-14 12:30 GMT

కథ బాగుంటే బామ్మ పాత్ర చేసేందుకు రెడీ అంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. చావా సినిమా ప్రమోషన్ల లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో రష్మిక మాట్లాడుతూ.. తాను జీవితాన్ని సీరియస్ గా తీసుకోనని చెప్పింది. పుష్ప -2 బ్లాక్ బస్టర్ కొట్టడంతో సంతోషంగా ఉన్న ఈ భామ ఆ వెంటనే విక్కీ కౌశల్ తో కలిసి ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ బయోపిక్ చావా సినిమాలో ఏసుబాయి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చావా సినిమా ఇవాళ థియేట్రి కల్ గా రిలీజైంది. ఈ సినిమాలో.. ఔరంగా జేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా కన్పించనున్నారు. అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటీ తదితరులు ఈ మూవీలో నటించారు. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లలో ఇటీవల రష్మిక మందన్నతన కాలి నొప్పితోనే పాల్గొంది. రష్మిక మందన్న ఇటీవల జిమ్ చేస్తుఉండగా ఆమె కాలు ఫ్యాక్చర్ అయ్యింది. ఆమెను వైద్యులు బెడ్ రెస్ట్ తీసుకొవా లన్నారు. కానీ ఆమె మాత్రం చావా కోసం ప్రమోషన్ లలో కుంటుకుంటునే ప్రొగ్రామ్ లలో పాల్గొన్నారు.

Tags:    

Similar News