టాలీవుడ్ స్టార్ హీరోలు నటనతోపాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. ఏషియన్ మూవీస్ టాలీవుడ్ స్టార్ హీరోలతో అసోసియేట్ అవుతూ.. మల్టీప్లెక్స్లను నిర్మించడం ద్వారా వాటికి జనాల్లో క్రేజ్ తీసుకొస్తోంది. మహేష్ బాబుతో కలిసి గచ్చిబౌలిలో నిర్మించిన ఏఏంబీ ఎంత పెద్ద హిట్టో హైదరాబాద్ జనాలకు తెలుసు. అలాగే అమీర్ పేటలో అల్లు అర్జున్ తో కలిసి ‘ఏఏఏ' మల్టీప్లెక్స్ నిర్మించగా.. దానికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. మహబూబ్ నగర్ లో విజయ్ దేవరకొండ భాగస్వామ్యంలోనూ ఒక మల్టీప్లెక్స్ కట్టారు. తాజాగా మాస్ రాజా రవితేజతో కలిసి ఏషియన్ వాళ్లు నిర్మించిన 'ఏఆర్డీ' సినిమాస్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాది విజయవాడ హైవే మార్గం లోని వనస్థలిపురంలో కట్టిన మాల్లో ఈ మల్టీప్లెక్స్ ఉంది. హైదరాబాద్లో ఈస్ట్ సైడ్ నిర్మితమైన తొలి మల్టీప్లెక్స్ ఇదే కావడం విశేషం. ఇక్కడ ఎక్కువగా మిడిల్ క్లాసే ఉంటారు. అందుకే ఇప్పటిదాకా మల్టీప్లె క్స్ నిర్మాణం కాలేదు. కానీ ఇక్కడ ఏషియన్ సునీల్, రవితేజ కలిసి ఆరు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ అందుబాటులోకి తెచ్చారు. ఇది ఇన్స్టంట్ హిట్టవడం.. జనాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సినిమాలు చూస్తుండడం విశేషం. ఈ మల్టీప్లెక్స్కు ‘ఎపిక్' స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో నిర్మితమైన తొలి ఎపిక్ స్క్రీన్ ఇదే కావడం విశేషం.