ఉగాది సందర్భంగా మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించబోయే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. రవితేజ 75వ సినిమాను భాను బోగవరపు తెరకెక్కించనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ‘వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు… రెడీ అయిపొండ్రి’ అంటూ ఆయన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఫుల్ టూ కామెడీ, డాన్స్, యాక్షన్ సీన్స్‌తో అదరగొడతామని నాగవంశీ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా 'దావత్'లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది. కాగా ఇప్పటికే సంక్రాంతి 2025కి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దిల్ రాజు కూడా వాళ్ళ సినిమాలని అనౌన్స్ చేశారు.
రవితేజకు ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఇటీవల వచ్చిన ఈగల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజయిపోతుంది. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది.