Simran Clarity : తల్లిపాత్రలకు రెడీ.. సిమ్రాన్ క్లారిటీ

Update: 2025-05-23 09:00 GMT

నటి సిమ్రాన్ తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో మంచి కథా నాయికగా పేరుంది. అబ్బాయిగారి పెళ్లి చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్ష కులకు పరిచయమైన సిమ్రాన్... 1999 నుంచి 2004 వరకు అగ్రకథా నాయికగా కొనసాగింది. తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్స్టార్ అని పేరు తెచ్చుకుంది. పలు హిందీ, మళయాల సినిమాల్లోనూ నటించింది. తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే తల్లి పాత్ర గురించి ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. పనికిమాలిన డబ్బా రోల్స్ లో నటించడం కంటే అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమమని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు డబ్బా కార్టెల్ సిరీస్లో నటిని ఉద్దేశించి చేసినవే అని చాలా మంది కామెంట్ చేశారు. అయితే వాటిపై వివరణ ఇచ్చిన సిమ్రాన్ తాను ఆ సిరీస్ చూశానని, చాలా బాగుందని చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరికి చేరాలో వారికి చేరిన తర్వాత తనకు క్షమాపణ కూడా చెప్పారని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News