ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా హీరో పవన్ కళ్యాణ్‌కు హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని ఆస్పత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కళ్యాణ్ కుమార్‌గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను. నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలి’ అని ఆయన కోరారు. షిహాన్ హుసైని 1986లో విడుదలైన ‘పున్నగై మన్నన్’ చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమా గుర్తింపునిచ్చింది. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారుచేశారు.