Surya Kiran : సత్యం దర్శకుడు సూర్యకిరణ్‌ కన్నుమూత

Update: 2024-03-11 10:01 GMT

తెలుగు సినీ దర్శకుడు, హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త సూర్యకిరణ్ చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు తెలుస్తోంది. తెలుగులో రాజూభాయ్, సత్యం, ధన 51 వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు బిగ్ బాస్‌లోనూ ఆయన పాలుపంచుకోవడం గమనార్హం. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్‌ అయ్యారు.

సూర్యకిరణ్ (Suryakiran) మృతి పట్ల సినీ అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్యకిరణ్‌ ‘మాస్టర్‌’ సురేష్‌ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాల నటుడిగా చేశారు. ఆ తర్వాత సహాయ నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించారు. కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు.

Tags:    

Similar News