Madras High Court : వచ్చే నెల 8లోగా సమాధానమివ్వండి : నయనతారకు హైకోర్టు ఆదేశాలు

Update: 2024-12-13 06:15 GMT

'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదంలో భాగంగా నటుడు ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులపై ఆయన పిటిషన్ వేశారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం జనవరి 8వ తేదీ లోపు ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నయన్ దంపతులను, నెటిక్స్ బృందాన్ని ఆదేశించింది. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ 'నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. తన పర్మిషన్ తీసుకోకుండా ఇందులో 'నానుమ్ రౌడీ దాన్' బిహైండ్ ది స్క్రీన్ ఫుటేజ్ ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. మూడు సెకన్ల క్లిప్ కు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నయన తార ధనుష్ క్యారెక్టర్ ను తప్పుబట్టారు. లీగల్ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించడంపై ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News