నారా రోహిత్ నటించిన ప్రతినిధి-2 సినిమా విడుదలను నిలిపివేయాలని వైసీపీ ఈసీని కోరింది. ఈ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆ పార్టీ గ్రీవెన్స్ ఛైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం ప్రజల మనసులను కలుషితం చేస్తూ ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉందని వారు అన్నారు. కాగా జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు రిలీజ్ కానుంది. సిరీ లెల్లా ఈ సినిమాకు హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలలో నటించారు. యంగ్ మ్యూజిక్ డిఏక్టర్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
బాణం’ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన నారా రోహిత్.. ఒకప్పుడు ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ‘సోలో’ లాంటి కమర్షియల్ సినిమా చేసి హీరోగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా కానీ, నటుడిగా గానీ ఆయనకు మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టాయి.