Rishab Shetty : తెలుగులో కాంతార హీరో దూకుడు

Update: 2024-10-20 04:47 GMT

కాంతారతో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు రిషబ్ శెట్టి. అంతకు ముందు కన్నడ సినిమాలతో పరిచయం ఉన్నవారికి అతని టాలెంట్ గురించి బాగా తెలుసు. బట్ కాంతారకు హీరోగానే కాక దర్శకుడుగానూ సత్తా చాటాడు. శాండల్ వుడ్ లో శెట్టి హీరోల దూకుడు స్ట్రాంగ్ గా ఉంది. ఆ టీమ్ నుంచే వచ్చిన రిషబ్ ఈ మూవీతో ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. ఆ ఇమేజ్ ను పెంచుకునేందుకు ఇప్పుడు టాలీవుడ్ లోనూ అడుగుపెడుతున్నాడు. కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన న్యూస్ వస్తున్నా.. రూమర్ అనుకున్నారు. బట్ మనోడు ఏకంగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ప్రశాంత్ వర్మతో జై హనుమాన్ ప్రముఖంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ మూవీతో మరో సారి ప్యాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టబోతున్నాడు.

హను మాన్ కు సీక్వెల్ గా ప్రశాంత్ సినీ వర్స్ లో భాగంగా జై హనుమాన్ ఉండబోతోంది. ఏ అంచనాలు లేకుండానే వచ్చిన హను మాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ప్రశాంత్ కు ఇమేజ్ వచ్చింది. రిషబ్ ఆల్రెడీ క్రేజ్ ఉంది. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ ను మైత్రీ సెట్ చేసింది. మను మాన్ టైమ్ లో ప్రశాంత్ కు బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ జై హను మాన్ కు ఆ ప్రాబ్లమ్ ఉండదు. అందుకే ఓ రేంజ్ మూవీని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

మైత్రీతో పాటు సితార బ్యానర్ లో కూడా ఓ మూవీకి సైన్ చేశాడు రిషబ్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే కాంతార 2 తర్వాత ముందు మొదలయ్యేది సితార వారి సినిమానే అంటున్నారు.

మొత్తంగా అటు ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలతో దూకుడు చూపిస్తుంటే.. కన్నడ హీరోలతో తెలుగు ప్రొడక్షన్ హౌస్ లు దూకుడు చూపిస్తున్నాయి. మరి రిషబ్ కుతెలుగులో ఎలాంటి రిసెప్షన్ వస్తుందో చూడాలి.

Tags:    

Similar News