Hari Hara Veera Mallu : రొమాంటిక్ కిక్కు .. ‘తార తార నా కళ్లు' సాంగ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొం దుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'హరి హర వీర మల్లు'. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా సిద్ధమవుతోం ది. ఇక ఈ అవైటెడ్ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఒక్కొక్క సాంగ్ ని రిలీజ్ చేస్తూ మంచి హైప్ క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా సినిమా నుంచి నాలుగో సాంగ్ విడుదల చేసింది చిత్ర బృందం. 'తార తార నా కళ్లు.. వెన్నెల పూస నా ఒళ్లు' అంటూ సాగే పాట ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా నిధి తన అందాలతో అదరగొట్టేసింది. చాలాకాలం తర్వాత పవన్ పై ఒక రొమాంటిక్/డ్యూయెట్ సాంగ్ మిస్ అవుతున్నవారి కి ఇది ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఇందులో సాంగ్ మూడ్ కి తగ్గట్టుగా సెట్ చేసిన సెట్టిం గులు.. విజువల్స్ సర్పైజ్ క్యామియోలు కూడా కనిపించడం విశేషం. ఎంఎం కీరవాణి మంచి ట్యూన్ ని అందించగా.. శ్రీహర్ష ఈమని ఇచ్చిన సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్ ను లిప్సిక, ఆదిత్య ఆలపించారు.