RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాపై హైకోర్టులో పిల్ దాఖలు..
RRR Movie: అమరావతి హైకోర్టులో ఆర్‌ఆర్‌ఆర్‌పై పిల్ దాఖలు చేశారు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య.;
RRR Movie (tv5news.in)
RRR Movie: ట్రిపుల్ ఆర్ సినిమాకు కష్టాలు తప్పట్లేదు. అమరావతి హైకోర్టులో ట్రిపుల్ ఆర్ సినిమాపై పిల్ దాఖలు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య. ట్రిపుల్ ఆర్ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమ్రం భీంల చరిత్రను వక్రీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోరారు. చిత్రం విడుదలపై స్టే విధించాలన్నారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది ఈ పిటిషన్. పిల్‌ను సీజే ధర్మాసనం విచారణ జరపుతుందన్నారు ఉజ్జల్ భూయాన్.