సమంత హీరోయిన్ గా కొంత గ్యాప్ తీసుకుంది. కానీ ఎవరూ ఊహించని విధంగా నిర్మాతగా కొత్త టర్న్ తీసుకుంది. ఈ టర్నింగ్ లో ఫస్ట్ మూవీగా వచ్చింది శుభం మూవీ. ఈ నెల 9న విడుదలైంది. అంతా దాదాపు కొత్త వారితో రూపొందిన ఈ మూవీ ప్రీమియర్స్ తో మొదలుపెట్టింది సమంత. ప్రీమియర్స్ నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అది కాస్తా మౌత్ టాక్ తో కలెక్షన్స్ పెంచే వరకూ వెళ్లింది. ఆశ్చర్యంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. పోస్టర్ వాల్యూ లేకపోయినా ఓపెనింగ్స్ వచ్చాయంటే కారణం కేవలం సమంత అని వేరే చెప్పక్కర్లేదు. అంటే తన క్రేజ్ ఇంకా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. తాజాగా సక్సెస్ మీట్ పెట్టారు.
ఈ సక్సెస్ మీట్ లోనే సమంత ఈ కామెంట్స్ చేసింది. తను చెప్పింది వింటే.. ‘ఈ ఇండస్ట్రీలో కేవలం టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది. ఇంతకు ముందు నేను ఆలోచించాను.. ఎలా ఇంత ధైర్యంగా వచ్చేశాను ప్రొడక్షన్ లోకి అని. కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని హ్యాపీ ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు అర్థం అవుతోంది.. ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తుంటారు అని. ఈ ఫీలింగ్ అడిక్టివ్ గా ఉంటుంది’.. అంటూ తను చెప్పిన మాటలు చూస్తే ఈ విజయం తనుకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సింపుల్ గా టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టాను అని చెప్పకనే చెప్పింది సమంత.